BREAKING
సత్య సాయి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కరువు చెట్లు పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ నందిపాడు కాలనీ సమీపంలో గుర్తు తెలియని శవం కలకలం: పంచాయతీ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన రవితేజ ‘ఇరుముడి’ సినిమా.. ‘యాలాలో యాలాలో’ వీడియో సాంగ్ విడుదల వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధం చేసిన సైబరాబాద్ పోలీసులు.. పటిష్ట భద్రతతో పాటు విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి ముగిసిన బ్రిక్స్ సదస్సు.. స్వదేశాలకు పయనమైన వివిధ దేశాల అధినేతలు మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం .... ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి & మాజీ కార్పొరేటర్ బన్నాల గీత నాగోల్‌లో అంబరాన్ని అంటుతున్న గణేష్ ఉత్సవాలు.. 72 అడుగుల భారీ మట్టి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ తిరుమల వాహనాల అనుమతిపై వస్తున్న వార్తలు అవాస్తవం: టీటీడీ స్పష్టత ఎల్బీనగర్‌లో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అధికారుల చర్యలు ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేష్ మండపాలను సందర్శించిన టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ గాంధీ ఆస్పత్రి వైద్యుల అరుదైన ప్రతిభ.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం బిగ్ బాస్ హౌస్‌లో దేబ్జానీ మనసులోని మాట.. ముఖేష్‌పై ప్రత్యేక ఇష్టం సిల్క్ సిటీ... గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత సిటీగా ఉండాలి* *పట్టణ ప్రజలకు ధర్మవరం తెదేపా ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపు* ఇరుముడి’ విజయానందం.. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన చిత్ర యూనిట్ ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు* *సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా పరిటాల శ్రీరామ్* *87మందికి రూ.44 లక్షల చెక్కులు

ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు* *సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా పరిటాల శ్రీరామ్* *87మందికి రూ.44 లక్షల చెక్కులు

Select Suryaa Now
ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు*   *సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా పరిటాల శ్రీరామ్*  *87మందికి రూ.44 లక్షల చెక్కులు

 

ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం టిడిపి కార్యాలయంలో ఆయన ఆదివారం రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 87 మందికి 44లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల, వార్డుల నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు పరిటాల శ్రీరామ్ కు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ధర్మవరం పట్టణంలో శాంతినగర్ కు చెందిన టిడిపి కార్యకర్త  నెట్టెం కేశవ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్... కేశవ్ కు పార్టీ సభ్యత్వం ఉండటంతో ఇన్సూరెన్స్ వచ్చేలా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. శ్రీరామ్ చొరవతో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పత్రం పార్టీ కార్యాలయం నుంచి వచ్చింది. ఈ నేపథ్యంలో కేశవ సతీమణి నెట్టెం మహేశ్వరికి ఈ బీమా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో పాటు వారి కష్టాల విషయంలో ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరు చాలా గొప్పగా ఉందని అన్నారు. ఎంతో మందికి ఇప్పటికే సీఎంఆర్ఎఫ్  ద్వారా సాయం చేసినట్లు చెప్పారు. ధర్మవరం నియోజకవర్గంలోనే ఈ 26నెలల్లో 3కోట్లకు పైగా సాయం చేసినట్లు వివరించారు. గతంలో ఎప్పుడు ఇలాంటి సాయం అందలేదన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఏ కష్టం ఉందన్నా... ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తున్నారన్నారు. మరోవైపు కార్యకర్తల కుటుంబానికి ఏం జరిగినా నేనున్నానంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పందిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా కేవలం వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఎంతోమంది కార్యకర్తలు కుటుంబానికి ఈ సాయం అందిందన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉండటానికి ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తున్నందుకు తమకు ఎంతో సంతృప్తిగా ఉందని పరిటాల శ్రీరామ్ అన్నారు..…