భక్తులతో కిటకిటలాడిన వెంకన్న ఆలయం
ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది సెలవు రోజు కావడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు ఏడి శనివారాల నోము నోచుకుని అష్టోత్తరం కళ్యాణం చేయించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామ స్మరణతో ప్రతిధ్వనించింది వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలచుకున్న చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు