BREAKING
చారిత్రక క్లాక్ టవర్లు, ఢిల్లీ 900 స్లేవ్స్ వెనుక ఉన్న రహస్యాలు: భారత కాల రక్షకులపై ఆసక్తికర పుస్తకం అర్చకుడి కుటుంబానికి రూ.1.08 లక్షల ఆర్థిక సాయం అంతర్జాతీయ వేదికపై ఢిల్లీ మెట్రో సత్తా: బెర్లిన్ ఇన్నోట్రాన్స్ 2026 ప్రదర్శనలో డీఎంఐఎల్ అరంగేట్రం ప్రజల కోసం పనిచేసే ప్రజానేత ఇరిగినేని 2028-29 నాటికి పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడి ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టీడీపీలోకి వచ్చాం హమీద్ అన్సారీ, రాహుల్ గాంధీలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి బీఆర్‌ఎస్‌ హయాంలో అన్యాయం చేశారు : ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య జపాన్ వైమానిక దళ అధిపతి తేజస్ విన్యాసం తూర్పు తీరంలో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం బెంగళూరులో జపాన్ చట్టసభ సభ్యుల పర్యటన విశాఖలో 'స్లినెక్స్-26' సముద్ర విన్యాసాలు తమిళనాడులోని 15 జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక

కానూరులో ఘనంగా సహస్ర గరికార్చన..

Select Suryaa Now
కానూరులో ఘనంగా సహస్ర గరికార్చన..

 *గణపతి నామస్మరణతో మార్మోగిన ఆలయం” 

పెరవలి మేజర్  న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలోని వినాయక ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం దూర్వాష్టమి సందర్భంగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గణపతికి అత్యంత విశిష్టమైన సహస్ర గరికార్చన నిర్వహించారు. స్వామివారికి వెయ్యి గరికలతో ప్రత్యేకంగా అర్చనలు చేసి పూజలు నిర్వహించారు.దూర్వాష్టమి రోజున గణపతికి గరికతో పూజ చేయడం విశేషంగా భావిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం గణపతి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.గణపతి నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జంధ్యాల రాజా శర్మ మేజర్ న్యూస్ కు తెలియజేశారు.