కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర
Tue, Mar 31, 2026, 02:37 PM
|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 06:58 PM
మరికల్ మండల పరిధిలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో గురువారం పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. డంపింగ్ యార్డ్ ప్రాంతం నుంచి గ్రామంలోకి చొరబడిన కుక్క ఒక వృద్ధురాలితో పాటు మరో వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే కుక్క ఆరు గేదెలు, నాలుగు ఎద్దులు, ఒక గొర్రెపై కూడా దాడి చేసింది. గ్రామస్తులు అప్రమత్తమై కుక్కను పట్టుకుని చంపేశారు. డంపింగ్ యార్డ్ నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.