BREAKING
T20Iల్లో స్మృతి, షెఫాలీ 'సిక్సర్ల' రికార్డ్: ఏషియన్ గేమ్స్‌లో భారత ఓపెనర్ల విధ్వంసకర ప్రదర్శన కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్వానంగా అంతర్గత రోడ్లు బాలాపూర్ గణనాథుని సన్నిధిలో విజయ్ దేవరకొండ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన 'రణబాలి' హీరో! ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో వాంటెడ్ డ్రగ్ పెడ్లర్‌కు తీవ్ర గాయాలు వినాయక నిమజ్జనంలో దిల్ రాజు దంపతుల మాస్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్! తిమ్మాపూర్ ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి భారీ చోరీ… ఇట్లు అర్జున టీజర్ ఈవెంట్: చిన్ననాటి స్నేహితుడి కోసం వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న లేడీ డైరెక్టర్! ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? మతిమరుపు అంతా వయసు వల్లే కాదు స్వాతంత్ర్య పోరాటం ముగిసిన అధ్యాయం కాదు.. భావితరాల పవిత్ర వారసత్వం: చాగంటి కోటేశ్వరరావు కర్బన ఉద్గారాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలనే నిందించడం తగదు: ప్రధాని మోదీ త్యాగాల పునాదులపై వచ్చిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకుందాం డిసెంబర్‌లో మూడు జిల్లాల దీనీ ఇజ్‌తిమా-మంత్రి ఎన్ఎండి ఫారూక్‌

ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?

Select Suryaa Now
ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?
 
ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎక్కడిది?…
 
ప్రభుత్వ భూములుంటే స్వాధీనం చేసుకుని క్రిమినల్ చర్యలు తీసుకోండి…
 
22ఏతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు..
 
 అవసరమైతే న్యాయపోరాటం…
 
ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌ను రాజకీయ నిమజ్జనం చేస్తాం…
 
బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. కాంగ్రెస్ మాకు పోటీ కాదు…
 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్…
 
సూర్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి ::
 
 కేసీఆర్ ఫాంహౌజ్ భూముల సందర్శనకు కాంగ్రెస్ నేతలు వెళ్లడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? అధికార పార్టీ నేతలు ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఫాంహౌజ్‌లో ప్రభుత్వ భూములు ఉన్నట్లయితే అధికారులను పంపించి వాటిని స్వాధీనం చేసుకోవాలని, భూదోపిడీకి సంబంధించిన ఆధారాలను పత్రాలతో సహా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు 22ఏను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని విమర్శించిన ఆయన, ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ను రాజకీయంగా ఎదుర్కొంటామని, ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని అన్నారు. దానం నాగేందర్ తనను తాను ఖైరతాబాద్ వినాయకుడితో పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉందని, వినాయకుడిని చివర్లో నిమజ్జనం చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. కాగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లతో కలిసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి కొత్త ట్రైసైకిళ్లు, ఫాగ్ మిషన్లను బండి సంజయ్ అందజేశారు. ప్రతి డివిజన్‌కు చెత్త సేకరణ కోసం ఒక ట్రైసైకిల్‌ను అందిస్తున్నామని, అదనంగా ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపనున్నామని, రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులకు టెండర్లు ప్రారంభం కానున్నాయని, రూ.80 కోట్ల యూసీఎఫ్ నిధులతో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులు, మరో రూ.16 కోట్లతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గణేశ్ నవరాత్రి నిమజ్జన ఉత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించేందుకు అదనపు బడ్జెట్ కేటాయించామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించి పోలీసులకు సహకరించాలని కోరారు. కరీంనగర్ ప్రశాంతతకు మారుపేరని మరోసారి నిరూపిద్దామని పిలుపునిచ్చారు.