BREAKING
ఇరాన్ స్పైవేర్‌పై యూకే, యూఎస్, నెదర్లాండ్స్ సంయుక్త హెచ్చరిక ఐజ్వాల్‌లో క్రీడా సౌకర్యాల సమీక్ష వరల్డ్‌స్కిల్స్ షాంఘై 2026 కోసం బయలుదేరిన భారత్‌ నైపుణ్య బృందం టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సవాల్.. జగన్ పాదయాత్రపై తీవ్ర ప్రకటన తప్పుదారి పట్టించే సూచనలు, డార్క్ ప్యాటర్న్‌లపై రాపిడోకు ₹10 లక్షల జరిమానా యూపీఐ పేమెంట్స్‌పై కొత్త ఛార్జీలు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్‌పై క్రేజీ బజ్.. ఆ నెలలోనే థియేటర్లలోకి రానున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా? లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొన్నం ప్రభాకర్,ఆకుల నరసన్న పటేల్ హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ వినాయక అన్నదానం ఉందో చెప్పే వెబ్‌సైట్.. బ్యాచిలర్లు, హాస్టల్ విద్యార్థులకు వరం ప్రత్యేక ప్రచారం 5.0లో 95% ఫైళ్ల సమీక్ష దేశవ్యాప్తంగా 150 గతి శక్తి కార్గో టెర్మినళ్లు ప్రారంభం 'నువాఖై' పండుగ సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు పైడికాలువలో ఘనంగా వినాయక చవితి.. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి రైతులు సుభిక్షంగా ఉండాలి - పాడిపంటలు సమృద్ధిగా పండాలి పూజా కార్యక్రమంలో - ఆకుల శ్రీనివాసులు.. సౌదీ అరేబియాలో కొత్త భద్రతా హెచ్చరికలు ఎమ్మిగనూరు పట్టణానికి 24 గంటలు తాగనీరు

తప్పుదారి పట్టించే సూచనలు, డార్క్ ప్యాటర్న్‌లపై రాపిడోకు ₹10 లక్షల జరిమానా

Select Suryaa Now
తప్పుదారి పట్టించే సూచనలు, డార్క్ ప్యాటర్న్‌లపై రాపిడోకు ₹10 లక్షల జరిమానా

న్యూఢిల్లీ:రైడ్‌లు ఖరారు కాకముందే ప్రయాణికుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసేలా ఒత్తిడి తెచ్చే ప్రకటనలు, డార్క్ ప్యాటర్న్లు మరియు అక్రమ పద్ధతులను అవలంబించినందుకు ప్రసిద్ధ రైడ్-హెయిలింగ్ సంస్థ రాపిడో (రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్) పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ₹10 లక్షల జరిమానా విధించింది. రైడ్‌కి ముందే అదనంగా టిప్ ఇవ్వాలని కోరడం, బుకింగ్ ప్రాసెసింగ్ సమయంలో భయాందోళనలు కలిగించేలా ‘కన్ఫర్మ్ షేమింగ్’ మరియు ‘ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్’ వంటి మోసపూరిత డిజైన్ల ద్వారా ప్రయాణికులను ప్రభావితం చేసినట్లు రంగవ్యాప్త తనిఖీల్లో సీసీపీఏ స్పష్టం చేసింది.

టిప్ అనేది సేవలు పొందిన తర్వాత మాత్రమే ఇష్టపూర్వకంగా ఇచ్చేదని, రైడ్ దొరకడానికే ముందస్తు షరతుగా అదనపు ఛార్జీలు కోరడం చట్టవిరుద్ధమని సీసీపీఏ తెలిపింది. అలాగే, అదనపు డబ్బులు చెల్లిస్తేనే రైడ్ త్వరగా దొరుకుతుందనే వాదనకు రాపిడో ఎలాంటి నిరాధారమైన డేటాను సమర్పించలేకపోయిందని పేర్కొంది. కాగా, వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం ఇటువంటి అన్యాయమైన వాణిజ్య పద్ధతులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, ఇతర సంస్థలైన ఓలా, ఉబెర్‌లపై కూడా పరిశీలన కొనసాగుతోందని సీసీపీఏ వెల్లడించింది.