గాజులదిన్నె ప్రాజెక్టులో పోలీసుల గణేష్ నిమజ్జనం
గాజులదిన్నె ప్రాజెక్టులో పోలీసుల గణేష్ నిమజ్జనం
గోనెగండ్ల సూర్య ప్రతినిధి
గోనెగండ్ల పోలీస్‌స్టేషన్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహానికి పోలీసు సిబ్బంది బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. సీఐ చంద్రబాబు నాయుడు, ఏఎస్సై, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించారు.
నిమజ్జనానికి ముందు పోలీస్‌స్టేషన్ నుంచి గణనాథుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో కానిస్టేబుళ్లు మద్దిలేటి, వంశీకృష్ణ పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం పోలీసు సిబ్బంది సమక్షంలో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని గాజులదిన్నె ప్రాజెక్టులో పూర్తి చేశారు. కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.