|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 08:01 PM
రంగుల పండుగ అయిన హోలీ సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన హోలీ ఉత్సవాలలో బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు, మిత్రులు, అభిమానులతో కలిసి రంగులు చల్లుకుంటూ హర్షాతిరేకంగా హోలీ పండుగను జరుపుకున్నారు.హోలీ పండుగ మనుషుల మధ్య ప్రేమ, ఐక్యత, ఆనందాన్ని పెంచే పండుగ అని ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ గారు పేర్కొన్నారు. పటాన్చెరు ప్రాంత ప్రజలు అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ నాయకులు, యువకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని హోలీ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. రంగుల మధ్య స్నేహభావంతో పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పాల్గొన్న వారు తెలిపారు.రంగుల పండుగ హోలీ అందరికీ సంతోషం, శాంతి, ఐక్యత తీసుకురావాలని కోరుకుంటూ… హ్యాపీ హోలీ!..