BREAKING
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఎంపిక చిన్న పిల్లల్లో పెరుగుతున్న ‘వర్చువల్ ఆటిజం’ ముప్పు: స్మార్ట్‌ఫోన్ అతివాడకంతో తల్లిదండ్రులకు ఆరోగ్య నిపుణుల తీవ్ర హెచ్చరిక వశిష్ఠ- మోక్షజ్ఞ కాంబినేషన్ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్: సోషియో ఫాంటసీగా నందమూరి వారసుడి ఎంట్రీ అభిమానులకు నేచురల్ స్టార్ నాని గ్రాండ్ ట్రీట్: ఏకంగా 10 వేల మంది ఫ్యాన్స్‌తో స్పెషల్ మీట్ నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం విడాకులు పెరగడానికి అసలు కారణం అదే: కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు యువత క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా వసతులు.. - నగరాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ - రూ.34.83 లక్షలతో 50వ డివిజన్‌లో స్పోర్ట్స్‌ పార్క్ ప్రారంభం రాజమహేంద్రవరం : నగరంలోని యువత, క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా క్రీడా మౌలిక వసతులను విస్తరిస్తూ నగరాన్ని స్పోర్ట్స్ కరెన్సీ నోట్లతో గణపేశ్వరుడి అలంకరణ మైసా సినిమా కోసం నా ప్రాణాలనే పణంగా పెట్టాను: టీజర్ లాంచ్‌లో రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు బీహార్‌లో తీవ్ర విషాదం: కర్మ-ధర్మ పండుగ స్నానాలకు వెళ్లి భాగల్పూర్‌లో ఆరుగురు చిన్నారులు గల్లంతు, మృతి కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ సంచలన నిర్ణయం: జూలై 2024 అల్లర్ల కేసులో ఎనిమిది మందిపై మానవతా వ్యతిరేక నేరారోపణలు స్వీకరణ నేరాల నియంత్రణపై. ప్రత్యేక అవగాహన కల్పించాలి

మదనాపురంలో ఘనంగా గణనాథుని శోభయాత్ర

Select Suryaa Now
మదనాపురంలో ఘనంగా గణనాథుని శోభయాత్ర

మదనాపురంలో భక్తిశ్రద్ధలతో గణనాథుని శోభాయాత్ర

మునుగోడు,మేజర్ న్యూస్:

మండలంలోని వెలగలగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మదనాపురం కాలనీలో 
శ్రీ కౌండిన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు, మాజీ ఉప సర్పంచ్ మేకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. యువత, గ్రామ ప్రజలు కలిసికట్టుగా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కోరారు. శ్రీ కౌండిన్య యూత్ అసోసియేషన్ సభ్యులు చక్కటి ఏర్పాట్లు చేసి శోభాయాత్రను విజయవంతం చేసినందుకు అభినందించారు.
ఈ శోభాయాత్రలో సురిగి రవి, తాందారి లింగస్వామి, సురిగి లింగస్వామి, బక్క భాస్కర్, సురిగి నాగరాజు, ఈదులకంటి సైదులు, బక్క సందీప్, దాము అంజయ్య, బక్క సతీష్, బక్క భరత్‌తో పాటు యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.