నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం
నంద్యాల అర్బన్:నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన ఎస్బీఐ బ్రాంచ్‌ను జడ్జి అమ్మన్న రాజు మరియు బ్యాంకు అధికారులు ప్రారంభించారు.
నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను ప్రారంభించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జి అమ్మన్న రాజు, బ్యాంకు అధికారులు పాల్గొని నూతన బ్యాంక్ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి అమ్మన్న రాజు మాట్లాడుతూ.. కోర్టు ప్రాంగణంలోనే నూతన బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. న్యాయవాదులు, కోర్టుకు వచ్చే కక్షిదారులు తమ బ్యాంకింగ్ అవసరాలను సులభంగా తీర్చుకునేందుకు ఈ శాఖ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. న్యాయవాదులు తమ క్లయింట్లకు సంబంధించిన బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు వ్యక్తిగత బ్యాంకింగ్ అవసరాలకు కూడా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జడ్జి అమ్మన్న రాజు సూచించారు. కోర్టు ప్రాంగణంలో బ్యాంక్ శాఖ అందుబాటులోకి రావడంతో న్యాయవాదులు, న్యాయస్థాన సిబ్బంది, కక్షిదారులకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి.