రావుస్ జూనియర్ కళాశాలలో గురజాడ వెంకట అప్పారావు జయంతి వేడుకలు
నంద్యాల అర్బన్:రావుస్ జూనియర్ కళాశాల నందు గురజాడ వెంకట అప్పారావు గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఆయన జయంతి సందర్భంగా ప్రిన్సిపల్ రోడ్డ సుంకయ్య మాట్లాడుతూ ఆ మహానుభావుడు సమాజానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ సొంత లాభం కొంత మానుకో పొరుగు వాడికి తోడుపడవై అని చెప్పిన సూక్తిని విద్యార్థులకు వివరించాడు. అలాగే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ప్రబోధించిన ఆధునిక సాహిత్య వైతాళికుడు గురజాడ అప్పారావు గారు అని తెలియజేస్తూ, ఈ సమా జములో మానవులు ఎలా ఉండాలి తోటి వారికి ఏ విధంగా సహాయం చేయాలి అని చెప్పిన మహనీయుడు గురజాడ అప్పారావు గారిని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకుడు డాక్టర్ చిలకల బాలరాజు మరియు రసాయన శాస్త్ర అధ్యాపకుడు పుల్లయ్య గారు, మరియు ఇతర అధ్యాపక బృందము విద్యార్థులు పాల్గొన్నారు