మహారాష్ట్రలోని జలగావ్‌లో ఉద్రిక్తత: గణేష్నిమజ్జన ఊరేగింపుపై రాళ్లదాడి, పలువురికి గాయాలు
సూర్య జాతీయడెస్క్: మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా రావేర్ పట్టణంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయకనిమజ్జనానికిసంబంధించిఒకనిర్దిష్టమార్గంలోవెళ్తున్నసమయంలోరెండువర్గాలమధ్యమాటామాటాపెరిగిఘర్షణకుదారితీసింది.
ఈఘటనపై జలగావ్ జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ధివారే స్వయంగా రంగంలోకి దిగి రావేర్ పోలీస్ స్టేషన్లో పరిస్థితిని సమీక్షించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఇరు వర్గాలకు చెందిన వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాళ్లదాడి జరిగినప్పటికీ సంబంధిత గణేష్ విగ్రహ నిమజ్జనాన్ని పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంతంగా పూర్తి చేయించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలోఈ ఘటనపై ఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని, శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజలంతా సంయమనం పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ధివారే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీటీవీఫుటేజీలఆధారంగారాళ్లదాడికిపాల్పడినవారినిగుర్తించేప్రక్రియవేగవంతంగాసాగుతోందని, శాంతిభద్రతలనుదెబ్బతీసేందుకుప్రయత్నించినఏఒక్కరినీఉపేక్షించేదిలేదనిపోలీసులుస్పష్టంచేశారు.