BREAKING
రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు ఊతం పిల్లల రక్షణే మా ప్రాధాన్యత శాస్త్ర విజ్ఞాన ప్రచారానికి AI సాంకేతికత అందుబాటు ధరలో హెల్త్‌కేర్ సేవలు మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భారత్ వ్యూహాలు ఏఐతో మానవాళికి తీవ్ర ప్రమాదం ఆసియా క్రీడల వేళ జపాన్ క్రికెట్ దౌత్యం రూ.3,383 కోట్ల ఆస్తులు.. ఒక్కరోజు బిచ్చగాడిగా మారిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న హిమానీనదాలు దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు న్యూకాజిల్‌ను 4-1తో చిత్తు చేసిన లీడ్స్ ట్రంప్ మెయిల్-ఇన్ ఓటింగ్ ఆంక్షలపై స్టే దక్షిణాఫ్రికా కామన్వెల్త్ సమావేశానికి అరుణాచల్ ప్రదేశ్ బృందం కోల్‌కతాలో సెమీకండక్టర్ విభాగం ప్రారంభం ఇంజనీర్లు కలలను నిజం చేసే కర్మయోగులు

కోల్‌కతాలో సెమీకండక్టర్ విభాగం ప్రారంభం

Select Suryaa Now
కోల్‌కతాలో సెమీకండక్టర్ విభాగం ప్రారంభం

కోల్‌కతా:పశ్చిమ బెంగాల్‌ను భవిష్యత్తు టెక్నాలజీ పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కోల్‌కతాలోని సీఎస్ఐఆర్-సిజిసిఆర్ఐ (CGCRI)లో 'ఎమర్జింగ్ క్వాంటం అండ్ సెమీకండక్టర్ టెక్నాలజీస్' (EQST) విభాగాన్ని రాష్ట్ర మంత్రి కళ్యాణ్ చక్రబోర్తి సోమవారం ప్రారంభించారు. ‘క్వాంటం అండ్ సెమీకండక్టర్ టెక్నాలజీస్: ఇన్నోవేషన్స్ ఫర్ ది ఫ్యూచర్ (CQST-2026)’ జాతీయ సదస్సు సందర్భంగా ఆయన ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.

గ్లోబల్ సెమీకండక్టర్ రేసులో భారత్ ప్రేక్షక పాత్రకే పరిమితం కాజాలదని, రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థను, జాతీయ భద్రతను నిర్దేశించే శక్తి ఈ రంగానికి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, కర్ణాటకల తరహాలోనే బెంగాల్ కూడా తన శాస్త్రీయ వారసత్వంతో సెమీకండక్టర్ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారగలదని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కొత్త ఈక్యూఎస్టీ విభాగాన్ని జాతీయ క్వాంటం మిషన్‌తో అనుసంధానించాలని ఆయన సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రత్యేక ఫండ్ల ద్వారా క్వాంటం, సెమీకండక్టర్ పరిశోధనల నుంచి వచ్చే డీప్-టెక్ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని తెలిపారు. సీఎస్ఐఆర్-సిజిసిఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ బిక్రమ్‌జిత్ బసు మాట్లాడుతూ, గ్లాస్ మరియు సిరామిక్స్ పరిశోధనా పత్రాల ప్రచురణలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు.