ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ వేడుకలు
విద్యుత్ కాంతులు, ప్రత్యేక ఆకర్షణగా మక్కా-మదీనా నమూనాలు
శివమొగ్గ (కర్ణాటక): ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ పండుగను పురస్కరించుకుని కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో వేడుకలు అంబరాన్నంటాయి. నగరంలోని రాగిగుడ్డ ప్రాంతంలో ఉన్న ప్రముఖ అమీర్ అహ్మద్ సర్కిల్‌ను నిర్వాహకులు రంగురంగుల ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో నయన మనోహరంగా అలంకరించారు.
ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పరిశుద్ధ మక్కా మరియు మదీనాయె ముకరమ నమూనా కళాకృతులు (మోడల్స్) భక్తులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఆకట్టుకునే సెట్టింగ్స్ నగరంలో పండుగ శోభను మరింత పెంచాయి.
అమీర్ అహ్మద్ సర్కిల్ వద్దకు భారీగా చేరుకున్న స్థానిక యువత ఉత్సాహంగా సంగీత శబ్దాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. వేడుకలు ప్రశాంతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.