బంగ్లాదేశ్‌లో డెంగ్యూ పంజా: సెప్టెంబర్‌లోనే 87 మంది మృతి, ఈ ఏడాదిలోనే అత్యధిక నెలవారీ మరణాలు
సూర్య అంతర్జాతీయ డెస్క్: బంగ్లాదేశ్‌లో దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది.
గత 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 1,593 కొత్త డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన మొత్తం బాధితుల సంఖ్య 61,972కు పెరిగింది.
డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం మూడు నెలల ప్రత్యేక యాంటీ-డెంగ్యూ ప్రచారాన్ని చేపట్టింది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో లార్వా నివారణ మందులను పిచికారీ చేయడం, ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అయినప్పటికీ ఆసుపత్రుల్లో రోగుల రద్దీ పెరుగుతుండటంతో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసి నిరంతర వైద్య సేవలు అందిస్తున్నారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరారు.