జపాన్‌ను వణికిస్తున్న తీవ్ర తుపాను: తూర్పు తీరంలో భారీ వర్షాలు, ఈదురుగాలుల బీభత్సం
సూర్యఅంతర్జాతీయడెస్క్: జపాన్తూర్పుపసిఫిక్తీరాన్నిభారీతుపానుముంచెత్తుతోంది.
తుపానుతీవ్రత కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రధాన రహదారులపై రాకపోకలను నిలిపివేయడంతో పాటు పలు బుల్లెట్ రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో ఐదు రోజుల సెలవుల కాలం నడుస్తుండటంతో ప్రయాణాలు పెట్టుకోవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికార యంత్రాంగం సూచించింది. టోక్యో పరిసర ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
మరోవైపుఆసియా క్రీడల పోటీలపై కూడా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ఐచి ప్రిఫెక్చర్లో జరగాల్సిన ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) పోటీలను వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారానికి వాయిదా వేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. తీర ప్రాంతాల్లో భారీ ఎత్తున కెరటాలు ఎగసిపడుతుండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నాయని జపాన్ ప్రభుత్వం తెలిపింది.