కదిరి కాళిదాస్‌గా మెగాస్టార్ చిరంజీవి.. ‘కాక’ మూవీపై క్రేజీ అప్‌డేట్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘కాక’ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటికి వచ్చింది. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్న చిరంజీవి.. ఈ చిత్రంలో తాను పోషిస్తున్న పాత్ర తాలూకు పేరును లీక్ చేసి అందరిలోనూ క్యూరియాసిటీని పెంచారు. ‘కాక’లో తాను 'కదిరి కాళిదాస్' పాత్రలో నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఈవెంట్‌లో తన పక్కనే ఉన్న యాంకర్ స్రవంతిని చూపిస్తూ.. తన ఊరి పేరునే సినిమాలో తన కేరక్టర్‌గా పెట్టుకున్నట్లు చిరంజీవి సరదాగా తెలిపారు. ఇక ఈ భారీ చిత్రంలో మెగాస్టార్ కూతురు అమ్ముల పాత్రలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తోంది. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.