BREAKING
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి.... పలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. ఐఐటీ బాంబేలో విద్యార్థి బలవన్మరణం.. పరీక్షలో చాట్‌జీపీటీ వివాదం విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం దేశవ్యాప్తంగా నాలుగు హైకోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం బ్రిటన్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దుండగుడి దాడి.. వాహనం హైజాక్ చేసి బీభత్సం విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి మహాకవి గురజాడ జయంతి రాష్ట్ర పండగే.. మరి జన్మభూమి ఎస్.రాయవరం సంగతేంటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వరకట్న వేధింపులతో బీటెక్ విద్యార్థిని మృతి ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విశాఖలో టీ బోర్డ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక టీ ప్రచార వేడుక ప్రారంభం 150 ఏళ్ల ఒంగోలు.. ఘన చరిత్రకు ఘన వేడుకలు! జలధార-జలహారతి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి- కలెక్టర్ రాజకుమారి గణియా

రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో శ్రీ శాంతినికేతన్ విద్యార్థుల ప్రతిభ – స్వర్ణ పతకాలు కైవసం

Select Suryaa Now
రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో శ్రీ శాంతినికేతన్ విద్యార్థుల ప్రతిభ – స్వర్ణ పతకాలు కైవసం

నంద్యాల అర్బన్:
నంద్యాల క్రాంతినగర్‌లోని శ్రీ శాంతినికేతన్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.
శ్రీ సత్యసాయి జిల్లా అమెచ్యూర్ బేస్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని రామలక్ష్మణ్ గ్రౌండ్‌లో సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు 8వ రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 1,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో నంద్యాల జిల్లా జట్టు తరఫున శ్రీ శాంతినికేతన్ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు సి. అరవింద్, కె. అజయ్ ప్రాతినిధ్యం వహించారు.  
ఈ టోర్నమెంట్‌లో నంద్యాల జట్టు సమష్టిగా రాణించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అరవింద్, అజయ్ బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ శ్రీ సుధాకర్ గారు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించి పాఠశాలకు, నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావడం ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా వీరు రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ), సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.