☼ Suryaa News
🔴 తెలంగాణ నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా
తెలంగాణ

నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా

21 Sep 2026 karimnagarvenkatesh
  బీజేపీ ధర్నాపై సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఫైర్ సూర్య కరీంనగర్ ప్రతినిధి:
 గణేశ్ నిమజ్జనానికి నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా అని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. నిమజ్జన ఏర్పాట్లు, నీటి విడుదలపై మంత్రులు, అధికారులు వారం రోజులుగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.ఇప్పటికే చింతకుంట కెనాల్‌లో సిల్ట్ తొలగింపు, డస్ట్ పోయడం, అవసరమైన మిషనరీ తరలింపు వంటి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ముందస్తుగానే నీటి విడుదలపై చర్యలు చేపడుతుండగా, ధర్నా చేసిన ఐదు నిమిషాల్లోనే తమ పోరాటం వల్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.అన్ని పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అన్ని వర్గాల మనోభావాలను గౌరవిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని నరేందర్ రెడ్డి తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home