*దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
*కలెక్టరేట్‌లో 117 వినతుల స్వీకరణ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి , మేజర్ న్యూస్(సెప్టెంబర్ 21):
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎలాంటి పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు.జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు భూ సమస్యలు, పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉపాధి, రహదారులు, గ్రామ పంచాయతీ, హౌసింగ్ తదితర అంశాలపై మొత్తం 117 వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.... స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖాధికారులకు పంపి, నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్, డిఆర్వో స్వర్ణలత, జడ్పీ సీఈఓ సుధీర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ