అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న
- మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి
- నవరాత్రి ఉత్సవాల్లో డీజేలు వాడొద్దన్న ఎస్సై సతీష్
మరిపెడ, సెప్టెంబర్ 21,మేజర్ న్యూస్(సూర్య):
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కూన్య తండా గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి స్థానిక ఎస్సై గాండ్రాతి సతీష్ తో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ., అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న అని పేర్కొన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం గొప్ప సేవా కార్యక్రమమని, భక్తితో నిర్వహించే అన్నదానం ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు.గణనాథుని ఆశీస్సులతో భక్తులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. గణేష్ ఉత్సవాల్లో భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు నిమజ్జన కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలు వాడొద్దని సూచించారు.
అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను, నిర్వాహకులను చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, ఎస్సై సతీష్ అభినందించారు.
*నవరాత్రి ఉత్సవాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం*
మరిపెడ పట్టణంలోని శ్రీరామాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సోమవారం షేక్ రహిమోద్దీన్ -రషీదా బేగం దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మత సామరస్యానికి ఆదర్శంగా నిలిచారు.ఈ అన్నదాన కార్యక్రమం మానవత్వం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచిందని స్థానికులు కొనియాడారు.
తెలంగాణ