☼ Suryaa News
🔴 తెలంగాణ ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు
తెలంగాణ

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

21 Sep 2026 Purushotham

*ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

*విమానాశ్రయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి*

పరకాల, సెప్టెంబర్21, మేజర్ న్యూస్ 

 ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వ‌హించారు. బాపూజీ 14వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ జాతిపితగా ప్రకటించి గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరంగల్ పట్టణంలో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించాలని అన్నారు.  కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మెండు రవీందర్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బాసాని దయాకర్,శ్రీనివాస్ చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు దర్నా వేణుగోపాల్,మార్కండేయ చిట్స్ అధ్యక్షుడు రాచర్ల అశోక్ , ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ మంత్రి కాశయ్య, దుంపేటి నాగరాజు, స్థానిక కౌన్సిలర్ పోరండ్ల మౌనిక వేణు, మాజీ కౌన్సిలర్ చిదురాల దేవేందర్, దార్న కుమారస్వామి,తౌటమ్ మధు, భాస్కర్, సామంతుల రాజేందర్, ఆడెపు కుమారస్వామి, దాసరి రమేష్, మంతెన సంతోష్, పల్నాటి రాజేందర్, సతీష్ పాల్గొన్నారు

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home