☼ Suryaa News
🔴 తెలంగాణ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జనం
తెలంగాణ

ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జనం

21 Sep 2026 vikarabadraghavender

 

​– భక్తిశ్రద్ధలతో పాల్గొన్న జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఏఎస్పీ రాజేష్ మీనా

– నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ కుటుంబాల్లో ఐక్యత, ఆనందం నింపేందుకే ఈ వేడుకలు

 - ఎస్పీ స్నేహ మెహ్రా 

​వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ :జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ప్రతిష్టించిన వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం సోమవారం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక చింతన నడుమ ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, మరియు అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా, తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళహారతులు పట్టి, విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని భక్తిప్రపత్తులతో నిమజ్జనం చేశారు.​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ…, జిల్లా వ్యాప్తంగా ప్రజలు గణేష్ నవరాత్రి వేడుకలను అత్యంత ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం అభినందనీయమన్నారు. ప్రజల రక్షణ, భద్రతే ధ్యేయంగా అహర్నిశలు శ్రమించే పోలీస్ అధికారులు, సిబ్బంది పండుగల సమయంలోనూ విధుల్లో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో సిబ్బంది తమ కుటుంబాలతో కలిసి పాల్గొనడం వల్ల పోలీస్ కుటుంబాల మధ్య ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత, ఆత్మీయత, ఆనందం పెరుగుతాయని చెప్పారు. జిల్లా ప్రజలు, పోలీస్ సిబ్బంది కుటుంబాలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతిసంతోషాలు, సిరిసంపదలు తులతూగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్, ఆర్‌ఐలు నాగరాజు, శ్రీశైలంలతో పాటు పలువురు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home