ఎబ్బనూరు అడవిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ధారూర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 18): వికారాబాద్ జిల్లా ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూరు గ్రామ సమీప అడవి ప్రాంతంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. అడవి ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలు, పరిసరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతుడి వయసు, స్వస్థలం, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.