ఇనుముల నర్సయ్యకు బీఆర్ఎస్ నాయకుల నివాళి*
పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పణ*
*కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి*
దేవరుప్పుల సెప్టెంబర్ 17 మేజర్ న్యూస్ (సూర్య):
దేవరుప్పుల మండలంలోని చౌడూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇనుముల నర్సయ్య అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నర్సయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు బస్వ మల్లేశం మాజీ ఎంపీపీ కొల్లూరు సోమయ్య ప్రధాన కార్యదర్శి చింత రవి మండలం ముఖ్య నాయకులు ఏల సుందర్ నాయకులు అనంతోజు కృష్ణమూర్తి జోగు సోమనరసయ్య ఇనుముల రంగయ్య తోటకూరి క్రిష్టయ్య బసవ వెంకన్న తాటిపెళ్లి మహేష్ కోతి ప్రవీణ్ మండల యూత్ అధ్యక్షుడు బానోతు నవీన్ నాయక్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొని ఇనుముల నర్సయ్యకు నివాళులర్పించారు.