BREAKING
ముంబై వాసులకు పాల ధరల షాక్.. సెప్టెంబర్ 1 నుంచి లీటర్‌కు ఏకంగా రూ.110! తూప్రాన్ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం 22ఏ పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకోం.. మళ్లీ విజయ్–రష్మిక జోడీ.. ‘Ranabaali’పై పెరిగిన అంచనాలు, ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్! నాని ‘ది ప్యారడైజ్’పై భారీ హైప్.. ఒక్కో అప్‌డేట్‌తో పెరుగుతున్న అంచనాలు! నాగార్జున 100వ సినిమాకు టైటిల్ ఫిక్స్.. బర్త్‌డే స్పెషల్‌గా ‘King100’ గ్లింప్స్‌తో బిగ్ ట్రీట్! కొత్త కారు పూజలో ఊహించని విషాదం.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద 68 ఏళ్ల వ్యక్తి మృతి! తెలంగాణ NEET విద్యార్థులకు బిగ్ అప్డేట్.. MBBS సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ షురూ! త్రిబుల్ ఆర్ భూసేకరణలో మెదక్ జిల్లా ఉత్తమ పనితీరు.. వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలి. నేపాల్ వరదల్లో చిక్కుకున్న 28 మంది ఏపీ యాత్రికులు సేఫ్.. ఊపిరి పీల్చుకున్న కుటుంబాలు! ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేపాల్ వరదల్లో హైదరాబాద్ టెకీ మిస్సింగ్.. చివరి కాల్ తర్వాత కుటుంబంలో తీవ్ర ఆందోళన! సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలి

22ఏ పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకోం..

Select Suryaa Now
22ఏ పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకోం..

22ఏ పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకోం..
 

సంగారెడ్డి మేజర్ న్యూస్ ప్రతినిధి : ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. రాత్రికి రాత్రే ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములను 22ఏ జాబితాలో చేర్చడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.తెలంగాణలో సుమారు 50 వేల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. నిషేధిత జాబితాలో ఉన్న పేదల ఇళ్లు, భూములను బేషరతుగా 22ఏ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.22ఏ భూముల సమస్యను పరిష్కరించకపోతే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఫల్యానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.