పత్తాలేని ట్రాఫిక్ పోలీస్
చేవెళ్ల, మేజర్ న్యూస్ (ఆగస్టు 31) :
చేవెళ్ళ ఇంద్రారెడ్డి చౌరస్తాలో నిన్న (ఆదివారం) ఉదయం భారీ ట్రాఫిక్ తో ప్రయాణికులు సతమతమయ్యారు. కూడలి వద్ద ఉండి… వాహనదారులకు నిర్దేశం చేయవాలసైిన ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో లేకపోవడంతో సామాన్య ప్రజలే తాము బాధ్యత తీసుకుని ట్రాఫిఫ్ నియంత్రించారు.
ప్రతి రోజు ఇంద్రారెడ్డి చౌరస్తాలో ఇదే తీరు
ఎప్పటికీ అక్కడ ట్రాఫిఫ్ పోలీసులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
రోడ్డు కూడళ్ళ వద్ద భారీ కెమెరాలు పెట్టీ కార్యాలయంలో కూర్చుని ఫోటోలు తీసి చాలన్లు వేసే దానిపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రించే వాటి పై లేదని ప్రజలు వాపోతున్నారు.