మీటింగ్‌కు రానివారిని కమిటీల నుంచి తొలగించాలి
మీటింగ్‌కు రానివారిని కమిటీల నుంచి తొలగించాలి
సేవ చేసే నాయకులకే పదవులు ఇవ్వాలి: జగ్గారెడ్డి
సంగారెడ్డి, మేజర్ న్యూస్ ప్రతినిధి: రాజకీయాలంటే కేవలం పదవులు, హోదాలు కాదని, ప్రజలకు సేవ చేయాలనే తపన, ఆసక్తి ఉండాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.పార్టీ సమావేశాలకు హాజరుకాని నాయకులను కమిటీల నుంచి తొలగించి, చురుగ్గా పనిచేసే వారికి అవకాశం కల్పించాలని కమిటీ అధ్యక్షులను ఆదేశించారు. ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేసేవారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, కార్యకర్తలకు అందుబాటులో ఉండే వారికే బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
ఈ నెల 31న తన కుమారుడు భరత్‌సాయిరెడ్డి నిశ్చితార్థం జరగనున్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పక హాజరుకావాలని జగ్గారెడ్డి కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.