BREAKING
చరిత్రలోనే అత్యంత వేడి నెలగా ఆగస్టు మధ్యంతర ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు $5,000 'ట్రంప్ డివిడెండ్' మూడు నెలల చిన్నారికి అరుదైన గుర్తింపు.. 7–8.5 సెం.మీ సహజ జుట్టు $1,999 ధరతో ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను ఆవిష్కరించిన ఆపిల్ బ్రెంట్ చమురు ధర $100 దాటడంతో కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్లు భారత ఆరోగ్య రంగాన్ని కొనియాడిన డబ్ల్యూహెచ్ఓ అధిపతి అబుదాబిలో ఒడిశా కీలక ఒప్పందం జర్మనీ రాష్ట్ర ఎన్నికల్లో అతివాద పార్టీ విజయం విదేశాంగ విధాన సాధనంగా అమెరికా ఆర్థిక శక్తి ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు త్వరలోనే పునఃప్రారంభం రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం బ్రిక్స్ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం సౌదీ చమురు కేంద్రాలపై హౌతీల దాడులను ఖండించిన భారత్ నేపాల్ వరద బాధితులకు భారత్ అండ మల్లాపూర్లో డీలా పడ్డ గులాబీ

సౌదీ చమురు కేంద్రాలపై హౌతీల దాడులను ఖండించిన భారత్

Select Suryaa Now
సౌదీ చమురు కేంద్రాలపై హౌతీల దాడులను ఖండించిన భారత్

న్యూఢిల్లీ:సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలు, పౌర మౌలిక సదుపాయాలపై హౌతీ మిలిటెంట్లు జరిపిన తాజా దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఇటువంటి చర్యలు ప్రాంతీయ భద్రతను, స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై, ముఖ్యంగా పౌర మరియు ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడులను భారత్ ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రాంతీయ భద్రతతో పాటు బాబ్-ఎల్-మండేబ్ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానానికి ముప్పు కలిగించేలా ఉన్న ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు అని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్ గ్రూప్ యెమెన్ కేంద్రంగా ఈ దాడులకు పాల్పడింది. ఇరాన్‌పై అమెరికా తన ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, ఈ దాడులతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి.