BREAKING
హోర్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన నౌకల రాకపోకలు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటామన్న ఇరాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి UAE పర్యటన ప్రారంభం బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న డెంగ్యూ ఇండోనేషియాలో విరుచుకుపడ్డ అగ్నిపర్వతం హోర్ముజ్ జలసంధి సమీపంలో 'నియంత్రిత మండలం' ఫ్రాన్స్‌లో కొలువైన అతిపెద్ద రాతి హిందూ దేవాలయం ఢిల్లీలో మరో విడత వర్షాలు నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తామన్న కేటీఆర్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన అల్కరాజ్ కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన సెగ.. నల్ల చొక్కాలతో అసెంబ్లీకి హాజరైన ప్రతిపక్ష సభ్యులు జిల్లా ఆసుపత్రిలో ఘనంగా గణపతి కర్ర పూజ చమురు ధరల మంట బిగ్ బాస్ తెలుగుకు నాగార్జున కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. పది కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్లకు చేరిన కింగ్ పారితోషికం ఏపీలో పోలీస్ అధికారి దురుసు ప్రవర్తన.. వృద్ధురాలిపై బూతులతో విరుచుకుపడ్డ వీడియో వైరల్.. సస్పెండ్ చేయాలని ప్రజాగ్రహం

ఇండోనేషియాలో విరుచుకుపడ్డ అగ్నిపర్వతం

Select Suryaa Now
ఇండోనేషియాలో విరుచుకుపడ్డ అగ్నిపర్వతం

8 విమానాశ్రయాలు మూసివేత
1.7 లక్షల మంది ప్రయాణికాలపై తీవ్ర ప్రభావం!
జకార్తా:ఇండోనేషియాలోని 'అనక్ క్రాకటౌ' (Anak Krakatau) అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో అక్కడి గగనతలం దట్టమైన బూడిద మేఘాలతో నిండిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని జకార్తాలోని రెండు ప్రధాన విమానాశ్రయాలతో సహా మొత్తం ఎనిమిది విమానాశ్రయాలను సోమవారం తెల్లవారుజామున మూసివేసినట్లు ఆ రవాణా శాఖ మంత్రి దుడి పుర్వగంధీ వెల్లడించారు.


విమానాశ్రయాల మూసివేత మరియు విమానాల రద్దు కారణంగా సుమారు 1,70,000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జావా మరియు సుమత్రా దీవుల మధ్య ఉన్న ఈ అగ్నిపర్వతం శుక్రవారం నుంచి విస్ఫోటనం చెందుతోంది. ఆదివారం రాత్రి 8:23 గంటలకు మరోసారి భారీగా పేలడంతో 15,000 మీటర్ల (50,000 అడుగులు) ఎత్తు వరకు బూడిద చేరుకుందని వాతావరణ సంస్థ (BMKG) తెలిపింది. బూడిద వల్ల ప్రజ ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉండటంతో బయటకు వచ్చే సమయంలో మాస్కులు ధరించాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. జకార్తా, లాంపుంగ్ ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించి ఆన్‌లైన్ (రిమోట్) తరగతులు నిర్వహిస్తున్నారు.

రాబోయే రోజుల్లో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే సంభావ్యత ఎక్కువగా ఉందని అగ్నిపర్వత పర్యవేక్షణ సంస్థ హెచ్చరించింది. 1883లో సంభవించిన చారిత్రాత్మక సునామీకి కారణమైన పురాతన 'క్రాకటోవా' అగ్నిపర్వత ప్రాంతం నుంచే ఈ 'అనక్ క్రాకటౌ' ఉద్భవించింది. కాగా, ఇండోనేషియా పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' (Ring of Fire) ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.