BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

'ప్రేమనే ఊరిలో' చిత్రం నుంచి ‘ఏరై పారే హృదయం’ మెలోడీ సాంగ్ విడుదల!

Select Suryaa Now
'ప్రేమనే ఊరిలో' చిత్రం నుంచి ‘ఏరై పారే హృదయం’ మెలోడీ సాంగ్ విడుదల!

 చిత్రంలో శ్రీరామ్, రమికమహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్ మరియు వనిల్లా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమనే ఊరిలో'. మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులలో మంచి అంచనాలను నెలకొల్పగా, తాజాగా చిత్ర యూనిట్ నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ బయటకు వచ్చింది.

'ఏరై పారే హృదయం' అంటూ సాగే ఈ అందమైన గీతాన్ని మల్లారెడ్డి విశ్వవిద్యాలయ పీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్. ప్రీతిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విడుదల చేశారు. ఈ పాటకు సునాద్ గౌతమ్ అద్భుతమైన బాణీలు అందించగా, రాంబాబు గోసాల ఆకట్టుకునే సాహిత్యం రాశారు. ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ తన మధురమైన గొంతుతో ఈ పాటను ఎంతో భావోద్వేగంగా ఆలపించారు. పాటలో హీరో హీరోయిన్ల మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ మరియు విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత చందు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ సినిమాలోని పాటను విడుదల చేసిన ప్రీతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె చేతుల మీదుగా సాంగ్ లాంచ్ కావడం సినిమాకు పాజిటివ్ వైబ్ తెచ్చిందని, త్వరలోనే జరగబోయే సక్సెస్ మీట్‌కు కూడా ఆమె హాజరవుతారని చెప్పారు. సినిమాలోని పాటలు, కథ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. మరో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సందర్భంలో ఈ పాటను విడుదల చేయడం మరింత సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.