BREAKING
విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి మహాకవి గురజాడ జయంతి రాష్ట్ర పండగే.. మరి జన్మభూమి ఎస్.రాయవరం సంగతేంటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వరకట్న వేధింపులతో బీటెక్ విద్యార్థిని మృతి ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విశాఖలో టీ బోర్డ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక టీ ప్రచార వేడుక ప్రారంభం 150 ఏళ్ల ఒంగోలు.. ఘన చరిత్రకు ఘన వేడుకలు! జలధార-జలహారతి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి- కలెక్టర్ రాజకుమారి గణియా AI యుగంలో నిరంతర అభ్యాసమే ఉద్యోగ భద్రతకు కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు: కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో శ్రీ శాంతినికేతన్ విద్యార్థుల ప్రతిభ – స్వర్ణ పతకాలు కైవసం అనంతపురం నగరంలో ద్విచక్ర వాహనంలో మంటలు OCA డైరెక్టర్ జనరల్‌తో క్రీడల మంత్రి మన్సుఖ్ మండావియా భేటీ టైర్-2, టైర్-3 నగరాల్లోనే సగం స్టార్టప్‌లు యువతకు అపూర్వ అవకాశాలు

నంద్యాల చిన్న చెరువు కట్టపై ‘స్వచ్ఛ నంద్యాల’

Select Suryaa Now
నంద్యాల చిన్న చెరువు కట్టపై ‘స్వచ్ఛ నంద్యాల’

స్వయంగా చెత్తను శుభ్రం చేసి శ్రమదానం చేసిన మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్

నంద్యాల అర్బన్:

నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక చిన్న చెరువు కట్టపై ‘స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ నంద్యాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ స్వయంగా చేతికి గ్లౌజులు ధరించి, చీపురు పట్టి చిన్న చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శ్రమదానంలో పాల్గొని ప్రజల్లో స్పూర్తి నింపారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు . పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. చిన్న చెరువు కట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చెత్తబుట్టలను మాత్రమే వినియోగించాలని సూచించారు. పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ, వార్డుల వారీగా పారిశుధ్య పనులను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ నంద్యాల ప్రతిజ్ఞ నిర్వహించారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న , స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ఇంజనీరింగ్, శానిటరీ విభాగాల అధికారులు, పారిశుధ్య సిబ్బంది మరియు స్థానిక పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.