☼ Suryaa News
🔴 తెలంగాణ ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
తెలంగాణ

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

21 Sep 2026 karimnagarvenkatesh

సూర్య జగిత్యాల ప్రతినిధి: ప్రజావాణి ద్వారా ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదులు, వినతులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి 57 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా అందిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో  అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బిఎస్ లత, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్, డిఆర్ఓ కె. వై ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home