ముంబై హాజీ అలీ కోస్టల్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం.. బీఎండబ్ల్యూ కారు ఢీకొని ముగ్గురు మృతి
సూర్య జాతీయ డెస్క్: ముంబైలోని హాజీ అలీ కోస్టల్ రోడ్డుపై జరిగిన ఘోర బీఎండబ్ల్యూ (BMW) కారు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు.
ఈ విషాద వార్త తెలుసుకున్న మరికొందరు బంధువులు అహ్మదాబాద్ నుండి ముంబైకి పయణమవుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, కారు నడుపుతున్న డ్రైవర్ లేదా బాధ్యుల వివరాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రద్దీగా ఉండే కోస్టల్ రోడ్డుపై జరిగిన ఈ ప్రాణనష్ట ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.