☼ Suryaa News
🔴 తెలంగాణ ఔట్ స్టాండింగ్ మెగా బ్లడ్ డోనర్ గాలిపెల్లి కుమార్ కు భారత్ రక్తదాత ఉత్తమ సేవ పురస్కారం
తెలంగాణ

ఔట్ స్టాండింగ్ మెగా బ్లడ్ డోనర్ గాలిపెల్లి కుమార్ కు భారత్ రక్తదాత ఉత్తమ సేవ పురస్కారం

21 Sep 2026 karimnagarvenkatesh

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి::

కరీంనగర్ జిల్లా 6 వ డివిజన్ కి చెందిన యువ రక్తదాత గాలిపెల్లి కుమార్ కు ఉత్తమ సేవ పురస్కారం లభించింది.రక్తదాన సేవల్లో చురుకుగా పాల్గొంటూ, అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలుస్తున్న గాలిపెల్లి కుమార్ సేవలను గుర్తించిన భారత రక్తదాన సేవ మిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూ రులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఉత్తమ సేవ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. యువతలో రక్తదానంపై అవగాహన కల్పించ డంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో రక్తాన్ని అందించేందుకు ఉదయ్ కుమార్ చేస్తున్న సేవలను నిర్వాహకులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, మరింత మంది యువత స్వచ్చందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తన సేవలను గుర్తించి అందించిన ఈ పురస్కారం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులోనూ రక్తదాన సేవలను కొనసాగిస్తానని గాలిపెల్లి కుమార్ తెలిపారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home