☼ Suryaa News
🔴 తెలంగాణ టీజీపీసీబీలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం
తెలంగాణ

టీజీపీసీబీలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం

17 Sep 2026 Reporter


తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ), సనత్ నగర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలనా  దినోత్సవాన్ని గురువారం దేశభక్తి, గౌరవభావంతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ చైర్మన్ శ్రీ రాజశేఖర్ రెడ్డి లక్కాడి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ పోరాటంలో త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. సెప్టెంబర్ 17 చారిత్రక, తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పం, ఐక్యతను ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ సాధించిన ప్రగతి ప్రజల త్యాగాలు, ఆకాంక్షల ఫలితమని ఆయన పేర్ర్కొన్నారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, సహజ వనరులను కాపాడటం ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని అన్నారు.
టీజీపీసీబీ అధికారులు, సిబ్బంది అంకితభావం, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కాలుష్య నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన తెలంగాణను అందించేందుకు సుస్థిర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఐక్యత, సామాజిక బాధ్యత, ప్రజాసేవ విలువలను కాపాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, అదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించాలని చైర్మన్ కోరారు.
కార్యక్రమంలో టీజీపీసీబీ సభ్య కార్యదర్శి జి. రవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
తెలంగాణ

తాండూరులో అంగరంగ వైభవంగా వినాయకుల నిమజ్జనం

🕑 18 Sep 2026
తెలంగాణ

పోక్సో కేసులో న్యాయస్థానం తీర్పు.. - నిందితుడికి 20 ఏళ్ల జైలు

🕑 18 Sep 2026
తెలంగాణ

22ఏ భూముల విషయంలో రేవంత్‌ డ్రామాలు ఆపాలి* *సాగర్‌ రైతులకు అన్యాయం చేస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదు: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి*

🕑 18 Sep 2026
తెలంగాణ

గణనాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి:మాజీ ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు గౌడ్

🕑 18 Sep 2026
తెలంగాణ

*ప్రారంభానికి నోచుకోని ఆటోమేటిక్ వే బ్రిడ్జి* చిట్యాల - మేజర్ న్యూస్

🕑 18 Sep 2026
తెలంగాణ

బీసీ జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది.. కేంద్రంపై కల్వకుంట్ల కవిత ధ్వజం

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home