మునుగోడు,మేజర్ న్యూస్:
గణనాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలనీ మాజీ ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు గౌడ్ ఆకాక్షించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పాత ఎస్సీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కేవలం పూజలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలకు వేదికగా నిలవాలన్నారు. అన్నదానం చేయడం ఎంతో పవిత్రమైన సేవ అని, భక్తులు, కాలనీ ప్రజలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు, బీజేపీ లేబర్ సెల్ జిల్లా కో-కన్వీనర్ మాదగోని నరేందర్ గౌడ్, రియల్ ఎస్టేట్ వ్యాపారి పందుల యాదయ్య, 3వ వార్డు సభ్యురాలు పందుల ప్రియాంక లింగస్వామి, పందుల శ్రీనివాస్, పందుల సంపత్ కుమార్, పందుల అశోక్, పోలే రాజు, పందుల సైదులు, పోలే వెంకటేశ్వర్లు, ఏర్పల నాగేష్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.