భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ
రెయిన్బో మెడోస్ బీరంగూడకు చెందిన వి. శ్రీధర్ కుమార్ కుటుంబ సభ్యుల భక్తి కానుక
పటాన్‌చెరు : నియోజకవర్గం బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి భక్తులు మూడు తులాల బంగారు నెక్లెస్‌ను కానుకగా సమర్పించారు. రెయిన్బో మెడోస్, బీరంగూడకు చెందిన వి. శ్రీధర్ కుమార్ కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో ఈ బంగారు నెక్లెస్‌ను అమ్మవారికి సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ అధికారుల సమక్షంలో శ్రీధర్ కుమార్ కుటుంబ సభ్యులు మూడు తులాల బంగారు నెక్లెస్‌ను ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్‌కు అందజేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నెక్లెస్‌ను అమ్మవారి అలంకరణ కోసం ఆలయానికి అందించారు.భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక భావనలకు ప్రతీకగా ఇలాంటి కానుకలు నిలుస్తాయని ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం భక్తుల సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.