చిట్యాల శివారులో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై తెలంగాణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో
కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆటోమేటిక్ వే బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. ప్రజాధనంతో అత్యాధునిక హంగులతో నిర్మించినప్పటికీ, ఇది ఇంకా ప్రారంభం కాకపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోవడంతో పాటు, ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ వే బ్రిడ్జ్‌ను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.