వినాయక నవరాత్రుల్లో ఆధ్యాత్మిక శోభ..
ఘన స్వాగతం పలికిన కాలనీవాసులు..
భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఆదిత్యరెడ్డి..
పటాన్ చెరు… వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ బస్తి, గౌతమ్ నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆయన సందర్శించారు. మండపాల్లో కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు.