☼ Suryaa News
🔴 తెలంగాణ 5వ రోజు ఆకాశ వర్ణంలో దర్శనమిస్తున్న శ్రీ సిద్ధి వినాయక స్వామి.
తెలంగాణ

5వ రోజు ఆకాశ వర్ణంలో దర్శనమిస్తున్న శ్రీ సిద్ధి వినాయక స్వామి.

18 Sep 2026 medaksurender

5వ రోజు ఆకాశ వర్ణంలో దర్శనమిస్తున్న శ్రీ సిద్ధి వినాయక స్వామి.
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
 

పటాన్‌చెరు: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ సిద్ధి వినాయక స్వామివారు ఆకాశ వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఈఓ లావణ్య, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పట్లోళ్ల లక్ష్మారెడ్డి, కె. సాయి గణేష్, ఎన్. సతీష్ కుమార్, ఏ. మురళి గౌడ్, ఏ. సంతోష్, ఏ. ప్రభు, బి. శివరాములు, ఏ. రాజేష్ గౌడ్, ఏ. ముకుంద రెడ్డి, సి. నారాయణరెడ్డి, డి. మహేష్, ఏ. కృష్ణ, ఆర్. శ్రీనివాస్, ఎం. రత్న తదితరులు పాల్గొన్నారు

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home