☼ Suryaa News
🔴 తెలంగాణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
తెలంగాణ

ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు

18 Sep 2026 karimnagarvenkatesh

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఎల్లారెడ్డిపేట, కిషన్ దాస్ పేట(కిష్టంపల్లి)లో పల్లె దవాఖానాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్

సూర్య ఎల్లారెడ్డిపేట, 

పల్లె దవాఖానాలతో ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం, కిషన్ దాస్ పేట(కిష్టంపల్లి)లో పల్లె దవాఖానాల ప్రారంభ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ఆయా పల్లె దవాఖానాలు ప్రారంభించారు.పల్లె దవాఖానాలో నిర్మించిన వివిధ గదులను అధికారులతో కలిసి పరిశీలించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. పల్లె దవాఖానాల నిర్మాణంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వైద్యులు, సిబ్బంది ప్రతి రోజూ గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు వృద్ధులకు వైద్య సేవలు అందిస్తారని వివరించారు. పిల్లలు, గర్భిణులకు క్రమం తప్పకుండా టీకాలు, ఆరోగ్య పరీక్షలు, సలహాలు సూచనలు అందిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, పీఏసీఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, సర్పంచ్ నరసింహులు, 
జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, ఇంచార్జి తహసీల్దార్ రజని, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home