☼ Suryaa News
🔴 తెలంగాణ ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: సీపీ గౌస్‌ ఆలం..!
తెలంగాణ

ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: సీపీ గౌస్‌ ఆలం..!

18 Sep 2026 karimnagarvenkatesh

కోర్కల్‌లో సీసీ కెమెరాలు ప్రారంభం....!

 

చిల్డ్రన్ పార్క్ ప్రారంభించిన సీపీ...!

వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో పలు అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 
ఈ కార్యక్రమాలకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్‌ ఆలం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హుజరాబాద్ ఏసిపి మాధవి జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట
గ్రామానికి చేరుకున్న సీపీకి గ్రామ సర్పంచ్ పూదరి రమ్యకృష్ణ అనిల్ గౌడ్, మహిళలు పుష్పగుచ్ఛాలు అందించి, హారతులతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం కోర్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీపీ గౌస్‌ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు ఏదైనా ఘటన జరిగినప్పుడు దర్యాప్తులో సీసీ కెమెరాల దృశ్యాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.
*కంటి వైద్య శిబిరానికి హాజరు*..
కోర్కల్ గ్రామంలో స్వామి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి సీపీ గౌస్‌ ఆలం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి, వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం చిన్నారులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడంతో పాటు వృద్ధులకు కంటి అద్దాలను అందజేశారు.
ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని సీపీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రశాంత వాతావరణంలో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించాలి
గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని సీపీ గౌస్‌ ఆలం సూచించారు. మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సూచించారు.
హరితహారంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన సీపీ
జంగంపల్లి గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కూడా సీపీ గౌస్‌ ఆలం పాల్గొన్నారు. కోర్కల్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.
వీణవంక పోలీస్‌స్టేషన్‌లో చిల్డ్రన్‌ పార్క్‌ ప్రారంభం
వీణవంక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్‌ పార్క్‌ను కూడా సీపీ గౌస్‌ ఆలం, గ్రామ సర్పంచ్ దాసరపు సరోజన రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు, పిల్లల్లో పోలీసుల పట్ల స్నేహపూర్వక భావన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
పార్క్‌ను పరిశీలించిన అనంతరం సీపీ గౌస్‌ ఆలం మీడియాతో మాట్లాడారు. ప్రజల భద్రత, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, నేరాల నియంత్రణ, గణేష్‌ ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై వివరించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తే శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా పరిరక్షించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, వైద్య సిబ్బంది, విద్యార్థులు, మహిళలు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home