అదిలాబాద్, సూర్య ఉమ్మడి జిల్లా ప్రతినిధి:రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది తాము ప్రారంభించిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలా చూడాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.
ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ శాఖ సూచనల మేరకు ఆయా మండపాల నిర్వాహకులు, యువత తగిన జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు.ఇదే విధంగా నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు సీపీ సూచించారు.
అనంతరం పోలీస్ ప్రధాన కార్యాలయంలో గత ఐదు రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని శోభాయాత్రను సీపీ శ్రీ అంబర్ కిషోర్ ఝా ప్రారంభించారు. గణపతి విగ్రహాన్ని డప్పు వాయిద్యాల నడుమ పోలీస్ అధికారులు, సిబ్బంది,పిల్లలు, మహిళలు కోలాటాలు, ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,ఏవో శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు బీమేష్,శ్రీనివాస్, ఆర్‌ఐలు శేఖర్, రమేష్,దామోదర్, మల్లేశం,సీసీ సందీప్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు తిరుపతి,సంయుక్త కార్యదర్శి ఓంకార్, సీపీఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. జె