వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్మన్
ఆనంద్ కుమార్ గౌడ్
మహబూబ్‌నగర్ నగరంలోని మర్లు భగీరథ కాలనీ, మొనప్పగుట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ మున్సిపల్ చైర్మ ఆనంద్ కుమార్ గౌడ్ దర్శించుకుని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు._
• _అనంతరం మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నదాన వితరణ చేశారు..ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... విఘ్నేశ్వరుడు మనందరిపై చల్లని చూపులు ప్రసరించి, కృపాకటాక్షాలతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెట్టుకాడి ప్రభాకర్, నరేందర్, మొనప్పగుట్ట కార్పొరేటర్ శేఖర్, ఆయా వినాయక మండపాల కమిటీ సభ్యులు, భక్తులు మరియు ఇతరులు పాల్గొన్నారు.