☼ Suryaa News
🔴 తెలంగాణ ధర్పల్లిలో వైద్య శిబిరం
తెలంగాణ

ధర్పల్లిలో వైద్య శిబిరం

18 Sep 2026 shivamahabubnagar

 *ధర్పల్లిలో వైద్య శిబిరం* 
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని ధర్పల్లి గ్రామంలో ఉపకేంద్ర  శుక్రవారం జనరల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు.శిబిరాన్ని జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శశికాంత్ సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రోగులను పరీక్షించి,అవసరమైన మందులను అందించారు.ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.గ్రామస్థులకు వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పలువురు శిబిరాన్ని వినియోగించుకున్నారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలకిష్టమ్మ రాములు,వైద్య సిబ్బంది శ్రీనివాసులు,సుధాకర్,శరభ లింగం,శారద,శకుంతల,ఆశా కార్యకర్తలు మాధవి,రామానుజమ్మ,లక్ష్మి,చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home