☼ Suryaa News
🔴 తెలంగాణ తాండూరులో నిమజ్జనంకు బయలుదేరిన గణేశులు
తెలంగాణ

తాండూరులో నిమజ్జనంకు బయలుదేరిన గణేశులు

18 Sep 2026 Reporter

 

*దాదాపుగా 285వినాయకుల  నిమజ్జనం కు శ్రీకారం

*ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకున్న నవరాత్రి ఉత్సవాలు

తాండూరు ,మేజర్ న్యూస్ (సెప్టెంబర్18) వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్ నేడు శుక్రవారం నాడు వినాయకులను  నిమజ్జనం చేయనున్నారు . ఇప్పుడే అంటే మధ్యానం రెండు గంటలకు నిమజ్జనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు  పట్టణంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు మున్సిపల్ పరిధిలోని 36వార్డుల ల్లో , పరిసర ప్రాంతాలలో దాదాపుగా 285వినాయకులను ప్రతిష్టించారు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనం కు శ్రీకారం చుట్టారు టౌన్ లో ఐదు రోజుల పాటు అంగ రంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాల వేడుకలు ఘనంగా జరుపు కొని , నేడు నిమజ్జనం చేయనున్నారు   టౌన్ లో ఏర్పాటు చేసిన గణపతులను తాండూరు కు సమీపంలోని కోకట్ కాగ్న నది తో పాటు మల్రెడ్డి పల్లీ చెరువు దగ్గర నిమజ్జనం చేస్తారు ఇందుకు సంబంధించి పోలీస్ లు భారీ బందో బాస్తూ ఏర్పాటు చేశారు   నిమజ్జనం కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తొ పాటు పలువురు ప్రముఖులు,అధికారులు హజరు కానున్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home