☼ Suryaa News
🔴 తెలంగాణ జగన్‌ కుటుంబానికి కేటీఆర్‌ ఆర్థిక భరోసా
తెలంగాణ

జగన్‌ కుటుంబానికి కేటీఆర్‌ ఆర్థిక భరోసా

18 Sep 2026 Reporter

 

సూర్య ఎండపల్లి:
ఇటీవల మృతి చెందిన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సింహాచలం జగన్‌ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ జగన్‌ కుటుంబ పరిస్థితిని కేటీఆర్‌కు వివరించడంతో ఆయన స్పందించి సాయం అందించారు. కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేటీఆర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలేటి కృష్ణారెడ్డి, గాజుల మల్లేశం, మారం జలందర్‌రెడ్డి, కల్వల గంగాధర్‌రావు, ముత్యం బలరాంరెడ్డి, రాంచందర్‌గౌడ్‌, మాధవరావు, సందీప్‌, కల్వల తేజ, దూస గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home