తిరుమలగిరి మేజర్ న్యూస్ :- తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నిక గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామానికి చెందిన సాంస్కృతిక సారధి గాయకుడు పాలకుర్తి శ్రీకాంత్ ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు . ఈ సందర్భంగా అధ్యక్షుడు పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలోని సాంస్కృతిక సారధి కళాకారుల సమస్యల పరిష్కారం కోసం సంఘం కృషి చేస్తుందని, రాష్ట్రస్థాయిలో హక్కుల సాధన కోసం మా జిల్లా కమిటీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుందని, కళాకారుల కష్టసుఖాల్లో తోడుగా నిలిచి, వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లి వేణు, గౌరవ అధ్యక్షులుగా వెన్నెల నాగరాజు, ఉపాధ్యక్షులు ఈర్ల సైదులు, కోశాధికారి పాక ఉపేందర్. సహాయ కార్యదర్శి నెమ్మాది స్రవంతి, ప్రచార కార్యదర్శి పోతరాజు శిరీష,గౌరవ సలహాదారులు, కుందమల్ల నాగలక్ష్మి, టీం లీడర్స్, గంట బిక్షపతి, గౌరవ సభ్యులు గడ్డం ఉదయ్, మాగి శంకర్, పల్లెల రాము, పల్లెల లక్ష్మణ్, చల్లా లక్ష్మి, మద్దిరాల మంజుల,ములకలపల్లి మల్లమ్మ, సిరిపంగి రాధ, తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ