చెల్లిని హత్య చేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నానని వెల్లడి
సూర్య నిజామాబాద్ :
నిజామాబాద్‌లో వైష్ణవి భర్త హరిబాబు హత్య ఘటనకు సంబంధించి వైష్ణవి అన్న విడుదల చేసినట్లు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన చెల్లి వైష్ణవిని హరిబాబు హత్య చేశాడని, ఆ ఘటనకు ప్రతీకారంగానే హరిబాబును హత్య చేసినట్లు వీడియోలో వైష్ణవి అన్న పేర్కొన్నాడు. చెల్లిని కోల్పోయిన బాధతోనే ఈ చర్యకు పాల్పడ్డానని తెలిపినట్లు సమాచారం. కాగా, ఈ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరిబాబు హత్యకు దారితీసిన పరిస్థితులు, వీడియోలో చేసిన ఆరోపణల నిజానిజాలు, ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.